Telugu Gateway
Latest News

డబ్ల్యూహెచ్ వో సంచలన వ్యాఖ్యలు

డబ్ల్యూహెచ్ వో సంచలన వ్యాఖ్యలు
X

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కరోనాకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం ఇప్పుడు కొత్త, ప్రమాద దశలోకి చేరుకుందని స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలో 24 గంటల్లోనే కరోనా కేసులు 1.50 లక్షలు నమోదు కావటమే. కొత్తగా నమోదు అయిన కేసుల్లో సగంపైగా కేసులు అమెరికా ప్రాంతంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి.

ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ లు తొలగిస్తూ ఆర్ధిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో ప్రజలు అంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రెస్ అథనోమ్ వ్యాఖ్యానించారు. కరోనాను అడ్డుకోవటానికి భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం తప్ప మరో పరిష్కారం లేదన్నారు. భారత్ లో కూడా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసుల వేగం మరింత పెరిగిన విషయం తెలిసిందే.

Next Story
Share it