Telugu Gateway
Latest News

డబ్బుంది..కానీ తీసుకునేవారే లేరు

డబ్బుంది..కానీ తీసుకునేవారే లేరు
X

దేశంలోని అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ఛైర్మన్ రజనీష్ కుమార్ చెప్పిన మాట ఇది. దేశంలోని కార్పొరేట్ కంపెనీలు రిస్క్ భయాలు వీడి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలని..అప్పుడు ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతుందని తెలిపారు. మార్కెట్లో అనిశ్చితి ఉన్న మాట వాస్తవమే అయినా..ఇంతటితో ఏమీ ఆగిపోదని అన్నారు. బ్యాంకుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు ఉందని..కార్పొరేట్లు మాత్రం నిధులు తీసుకోవటానికి ముందుకు రావటంలేదని వ్యాఖ్యానించారు. డబ్బులు ఇచ్చేవాళ్లే కాకుండా..డబ్బులు తీసుకునే వాళ్లు కూడా రిస్క్ కు భయపడుతున్నారని అన్నారు. ఏప్రిల్ లో ఎస్ బిఐకి భారీ ఎత్తున డిపాజిట్లు వచ్చాయని..వాటిని రివర్స్ రెపో విండో కింద ఆర్ బిఐ వద్ద ఉంచినట్లు తెలిపారు. కార్పొరేట్లు పెట్టుబడి పెట్టే అవకాశాలను పరిశీలించాలని కోరారు.

అంతే కానీ..ప్రభుత్వం నుంచి మరింత మద్దతు కోసం వేచిచూడకూడదన్నారు. కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్కీమ్ కింద 20 లక్షలకోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిందని తెలిపారు. దీంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో స్థూల అప్పులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. బడ్జెట్ లో అప్పులు 7.8 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారని..కానీ ఇప్పుడు అది 12 లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందన్నారు. పలు కొత్త రంగాల్లో అవకాశాలు కల్పించటంతోపాటు కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించినా కూడా కార్పొరేట్ పెట్టుబడులు మాత్రం ఊపందుకోలేదన్నారు.

Next Story
Share it