Telugu Gateway
Latest News

కీలక దశలో రెండు కరోనా వ్యాక్సిన్లు

కీలక దశలో రెండు కరోనా వ్యాక్సిన్లు
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా నియంత్రణకు పరిశోధనలు సాగుతుండగా...అందులో రెండు వ్యాక్సిన్లు మాత్రమే కీలక దశలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 200 కు పైగా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతుంటే 15 వ్యాక్సిన్లకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అన్నింటి కంటే అస్ట్రాజెనికా సంస్థ వ్యాక్సిన్ ముందు వరసలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మోడెర్నా వ్యాక్సిన్ కూడా అదే స్పీడ్ లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ఏడాదిలోపు రావొచ్చని డబ్ల్యుహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అథనోమ్ వెల్లడించారు.

కరోనా వైరస్ విషయంలో తమ స్పందన విషయంలో కొన్ని తప్పులు జరిగాయని ఆయన అంగీకరించారు. అమెరికా ఈ విషయంలో డబ్ల్యుహెచ్ వో పై తీవ్ర విమర్శలు చేటయంతోపాటు తాము ఈ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాకు అనుకూలంగా ఈ సంస్థ వ్యవహరిస్తోందని..అమెరికా నిధుల కేటాయింపును కూడా నిలిపివేసింది. ఈ తరుణంలో డబ్ల్యుహెచ్ వో చీఫ్ తప్పులు జరిగాయని అంగీకరించటం అత్యంత కీలకంగా మారింది. ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ఓ కమిటీ ని ఏర్పాటు చేస్తున్నారు. చైనాలో జరుగుతున్న వ్యాక్సిన్ల తయారీ గురించి డబ్ల్యూహెచ్ వో ఆరా తీసింది.

Next Story
Share it