Telugu Gateway
Latest News

భారత్ -చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత

భారత్ -చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత
X

కేంద్రం ఇటీవల వరకూ అంతా సాఫీగానే ఉందని ప్రకటించింది. ఇరు వైపుల ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కానీ ఆకస్మాత్తుగా ఉద్రిక్త పరిస్థితులు. భారత్ సైన్యంపై చైనా ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో కల్నల్ స్థాయి అధికారితోపాటు ఇద్దరు సైనికులు మరణించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. లద్దాఖ్ లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చైనా ఏకపక్షంగా కాల్పులు జరిపిందని సమాచారం. అయితే చైనా మాత్రం భారత్ ఆర్మీనే అక్రమంగా సరిహద్దులు దాటిందని ఆరోపిస్తోంది. సరిహద్దులో చైనా చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విషయం తెలిసిన వెంటనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుటాహుటిన రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.

ఈశాన్యంలోని గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్‌, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరాటాలు జరుగుతున్నాయి. సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఓవైపు ఇరు దేశాల దౌత్యవేత్తలు చర్చలు జరుపుతున్నా.. భారత జవాన్లపై డ్రాగన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజా కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ఆర్మీ అప్రమత్తమయ్యింది. మరి భవిష్యత్ పరిణామాలు ఎటు దారి తీస్తున్నాయనే ఉత్కంఠ నెలకొంది.

Next Story
Share it