Telugu Gateway
Latest News

‘ఈనాడు’ ఉద్యోగులపై వేతనాల కోత కత్తి?!

‘ఈనాడు’ ఉద్యోగులపై వేతనాల కోత కత్తి?!
X

20 నుంచి 40 శాతం వరకూ కోతకు ఛాన్స్

మే వేతనాల నుంచి అమల్లోకి

సహజంగా ఈనాడు అంటే జీతాలు ఠంచనుగా పడిపోతాయి. ప్రతి నెలా చివరి రోజు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. చివరి రోజు ఏదైనా సెలవు ఉంటే ముందు రోజే వేసేస్తారు. కానీ ఇదంతా గతం. కరోనా దెబ్బకు సీన్ మొత్తం మారిపోయింది. గత నెలలో జీతాలు 8వ తారీఖు అలా వేశారు. మే నెల జీతాలు మామూలుగా అయితే గత నెలాఖరు లేదా..జూన్ 1కి ఖాతాల్లో పడాలి. కానీ ఇఫ్పటివరకూ జీతాలు రాలేదు. ఇది ఒకెత్తు అయితే తాజాగా ఉద్యోగుల చెవిన పిడుగులాంటి వార్త పడింది. అది ఏంటి అంటే వేతనాల్లో కోత 20 నుంచి 40 శాతం మేర ఉండే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. అయితే కోత మాత్రం పక్కా. తెలుగులోని ప్రధాన పత్రికల్లో సాక్షి తప్ప..అన్ని పత్రికల్లో వేతనాల కోత అమలు అవుతోంది. ఇఫ్పటికే ఆంధ్రజ్యోతి వేతనాల్లో భారీగానే కోత వేసింది. మిగిలిన పత్రికలూ అదే బాట పట్టాయి. ఇప్పుడు ఈనాడు వంతు వచ్చింది. అయితే ఈనాడు అందరి కంటే భిన్నమైన మోడల్ లో వెళ్ళబోతుందని సమాచారం. అదెలా అంటే ప్రతి ఒక్క ఉద్యోగికి ఖచ్చితంగా 15 రోజుల వేతనం చెల్లిస్తారు. మిగిలిన 15 రోజుల సెలవుపై పంపటం వంటి ఆలోచనలు చేస్తున్నారు. దీని వల్ల న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండవనే కారణంగా ఈ దిశగా యోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది వేతనాల కోతతోనే ఆగిపోతుందా..మిగులు సిబ్బంది పేరుతో ఉద్యోగులపై వేటు కూడా పడుతుందా అన్న టెన్షన్ ఉద్యోగుల్లో నెలకొంది.

కరోనా దెబ్బకు యాడ్స్ రాక మీడియా రంగం అంతా విలవిలలాడుతోంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాపై కరోనా ప్రభావం పెద్ద ఎత్తున పడింది. గత మూడు నెలలుగా పత్రికల్లో ఒకటి అరా తప్ప..పెద్దగా ప్రకటనలు కన్పించటం లేదు. పత్రికల ప్రధాన ఆదాయం ప్రకటనలే అన్న సంగతి తెలిసిందే. అయితే ఈనాడు వంటి సంస్థ లాభాలు తప్ప..ఎప్పుడూ నష్టాలు చూడలేదని..అలాంటి సంస్థ కూడా రెండు, మూడు నెలలకే ఇంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది. ఏది ఏమైనా తెలుగులో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఈనాడు కూడా వేతనాలకు కోతకు రెడీ రావటంతో రాబోయే రోజుల్లో తెలుగు మీడియాలోమరిన్ని గడ్డుపరిస్థితులు తప్పవనే ఆందోళన మీడియా ఉద్యోగుల్లో నెలకొంది.

Next Story
Share it