Telugu Gateway
Latest News

వీహెచ్ కు కరోనా పాజిటివ్

వీహెచ్ కు కరోనా పాజిటివ్
X

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో విహెచ్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇటీవలే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వందమందికి దుప్పట్ల పంపిణీ చేశారు. అదే రోజు నుంచి వీహెచ్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా గాంధీ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.

Next Story
Share it