Telugu Gateway
Politics

కెసీఆర్ గుప్పిట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్

కెసీఆర్ గుప్పిట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో తన సామాజిక వర్గం వారినే నియమించుకుని..అక్కడ చీమ చిటుక్కుమన్నా రంగంలోకి దిగుతున్నారని తెలిపారు. వివాదస్పద భూములను పోలీసు అధికారులు దగ్గరుండి మరీ అధికార పార్టీ చెప్పిన వాళ్ల పరం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గురువారం నాడు ఫేస్ బుక్ లైవ్ లో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. నగరంలోని అత్యంత కీలకప్రాంతాలైన మాదాపూర్, సైబరాబాద్, కూకట్ పల్లి లాంటి చోట్ల సీఎం కేసీఆర్ తన సామాజిక వర్గం వాళ్ళను నియమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తన గుపిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. మాదాపూర్, సైబరాబాద్, కూకట్పల్లి లాంటి కీలక ప్రాంతాలలో కేసీఆర్ తన సామాజిక వర్గం వాళ్ళను నియమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తన గుపిట్లో పెట్టుకున్నారని అన్నారు. ఇప్పటికే పదవి విరమణ చేసిన ఒకే సామాజిక వర్గం వాళ్ళు అయిన నర్సింగరావు, కిషన్ రావ్, మదన్ మోహన్ రావు, విజయ రామారావు, వెంకట్ రావు, రమణారావు లాంటి వారికి కీలక పదవులు ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.

పోలీసు వ్యవస్థలో ప్రైవేటు సైన్యంగా పని చేసేవారికి, సొంత సామాజికవర్గం వారికి మాత్రమే పెద్దపీట వేస్తారా? ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ లు, ప్రత్యర్థులను వేధించేవారికి మాత్రమే పోస్టింగులా!? రాజకీయ ఫిరాయింపులు చేయించేవారిని ప్రభుత్వం ఉన్నత పదవులు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇస్తుందని విమర్శించారు.. ప్రభాకర్ రావు (ఐజీ-ఎస్ఐబి), వెంకటేశ్వరరావు (డిఐజీ), రాధాకిషన్ రావు (డీఎస్పీ-టాస్క్ ఫోర్స్) ఈ ముగ్గురూ నెలాఖరుకు రిటైరవుతున్నారని ఈ ముగ్గురినీ తిరిగి కొనసాగించడానికి వారి ఉద్యోగాలు కొనసాగడానికి ఫైల్ సిద్ధం చేశారని వాటిని డిజిపి వెంటనే తిరిగి పంపాలని లేకపోతే న్యాయస్థానంలో తేల్చుకుంటానని అన్నారు. కరోనా సమస్యకు సంబంధించిన ఫైళ్లు ఏమీ ముందుకు కదలవు కానీ..సొంత సామాజిక వర్గానికి చెందిన వారి నియామక ఫైళ్ళు మాత్రం పరుగులు పెడతాయన్నారు. కేసీఆర్ నయా రజాకార్ల పాలన ఇది అని ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ వీకే సింగ్ రాజీనామాతో ప్రభుత్వ తీరు బట్టబయలు అయిందన్నారు. నాలుగు డిజిపి పోస్టులు ఉన్నా రెండే భర్తీ చేశారు. 2 డీజీపీ పోస్టులు ఖాళీ..నెలాఖరుకు విరమణ చేసే వారికి పదవులు సిద్ధం చేసిన ప్రభుత్వం అన్ని శాఖలలో ఒకే కులం ఆధిపత్యం అన్ని శాఖల బాగోతాలు బయట పెడతా..నిజయితీ అధికారుల్లారా నోరు విప్పండి.

మీ కోసం ఎంతవరకైనా వస్తా.. ఎన్ని పొరాటలైనా చేస్తా..నా పైన ఎన్ని కేసులు పెట్టినా భయం లేదు.. అవినీతిపై పోరాటానికి సహకరించండి అని కోరారు. తమ సామాజికవర్గం వాళ్లకు అడ్డం వస్తారని పోలీసులు శాఖలో ఎంతో మందికి పదోన్నతులు ఆపారని వెల్లడించారు. డీజీపీ ఉత్సవ విగ్రహం గా మాత్రమే ఉన్నారని అన్ని తెలిసినా ఏమి పట్టించుకోవడం లేదని తనకంటే చిన్న అధికారులు తనపైన అజమాయిషీ చేస్తున్న ఆయన భరించడం దేనికి సంకేతమని అన్నారు. 15 ఏళ్ల క్రితం రిటైర్ అయిన సొంత సామాజికవర్గం వాళ్లను తీసుకువచ్చి కేసీఆర్ కీలక పోస్టుల్లో పెట్టారని పోలీసు శాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజికవర్గాలకు చెందిన సమర్థవంతమైన అధికారులు లేరా? అని ఆయన ప్రశ్నించారు.

Next Story
Share it