Telugu Gateway
Latest News

జస్ట్ 58 రోజులు...1.68 లక్షల కోట్ల పెట్టుబడులు

జస్ట్ 58 రోజులు...1.68 లక్షల కోట్ల పెట్టుబడులు
X

రిలయన్స్ సంచలనం

షెడ్యూల్ కంటే ముందే రుణరహిత కంపెనీగా రిలయన్స్

భారతీయ కార్పొరేట్ చరిత్రలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త సంచలనాలు నమోదు చేసింది. 58 రోజుల్లో ఏకంగా 1,68,818 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించింది. అందులో 53,124 కోట్ల రూపాయలు రైట్స్ ఇష్యూ రూపంలో రాగా, మిగిలిన 1,15,693.95 కోట్ల రూపాయలు జియో ఫ్లాట్ ఫామ్స్ లోకి వివిధ విదేశీ సంస్థలు పెట్టుబడుల రూపంలో పెట్టిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఫ్లాట్ ఫామ్స్ లోకి వరస పెట్టి పలు సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ స్పందించారు. షేర్ హోల్డర్లకు తాను ఇఛ్చిన మాట కంటే ముందే రిలయన్స్ ను రుణ రహిత కంపెనీగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. 2021 మార్చి నాటికి రిలయన్స్ ను రుణ రహిత కంపెనీగా మారుస్తామని ముఖేష్ అంబానీ గతంలో ప్రకటించారు. ఆ పని ఇఫ్పుడు అంత కంటే ముందే కాబోతుందని తెలిపారు.

అతి తక్కువ సమయంలో ఇంత భారీ ఎత్తున పెట్టుబడుల సాధించిన చరిత్ర గతంలో ఎక్కడా లేదన్నారు. ఈ పెట్టుబడుల సాధన ద్వారా కొత్త ప్రమాణాలు సృష్టించినట్లు అయిందన్నారు. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో ఇంత పెద్ద విజయాన్ని సాధించటం మామూలు విషయం కాదన్నారు. దీంతో పాటు పెట్రో-రిటైల్ జాయింట్ వెంచర్ లో బీపీకి వాటా విక్రయం ద్వారా 1.75 లక్షల కోట్ల రూపాయలు నిధులను సమీకరించినట్లు తెలిపారు. 2020 మార్చి 31 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర అప్పు 1,61,035 కోట్ల రూపాయలుగా ఉంది. అది ఇప్పుడు పూర్తిగా ఖాతాల నుంచి మాయం కానుంది.

Next Story
Share it