ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ రైలు సర్వీసులు రద్దు
BY Telugu Gateway25 Jun 2020 3:45 PM GMT

X
Telugu Gateway25 Jun 2020 3:45 PM GMT
కరోనా కారణంగా రైల్వే సర్వీసుల రద్దు వ్యవహారం అలా ముందుకు సాగుతూ పోతోంది. తాజాగా జులై 1 నుంచి ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ రైల్వే సర్వీసులు పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే అడ్వాన్స్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రం పూర్తి రిఫండ్ అందించనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రాజధాని, మెయిల్, ఎక్స్ ప్రెస్ సర్వీసులు మాత్రం నడుస్తాయి.
Next Story