Telugu Gateway
Latest News

‘మేక్ మై ట్రిప్’ లో 350 మంది ఉద్యోగుల తొలగింపు

‘మేక్ మై ట్రిప్’ లో 350 మంది ఉద్యోగుల తొలగింపు
X

ప్రముఖ ట్రావెల్ కంపెనీ ‘మేక్ మై ట్రిప్’ 350 మంది ఉద్యోగులను తొలగించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ చెబుతోంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం పడకేసింది. అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ కూడా ఎక్కడవి అక్కడ నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ హాలిడేస్ వ్యాపారం, అనుబంధ వ్యవహారాలు దారుణంగా దెబ్బతిన్నాయని కంపెనీ వెల్లడించింది. తొలగించిన ఉద్యోగులకు కంపెనీ మెడిక్లెయిం కవరేజ్ తోపాటు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. కరోనా కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రంగాల్లో ట్రావెల్ రంగం వాటానే అధికం. కరోనాతో భారత్ అతలాకుతలం అయి మూడు నెలలు కావస్తున్నా..పర్యాటక రంగం ఎప్పుడు గాడిన పడుతుందో తెలియని పరిస్థితి.

దీంతో పలు సంస్థలు ఉద్యోగులను తొలగించి వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. పలు దేశాలు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నా ఈ రంగం ఎప్పుడు కోలుకుంటుందో చెప్పటం కష్టం అంటున్నారు. కరోనా కు ముందు సాదారణ పరిస్థితులు రావాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. కేవలం 2021లోనే అంతర్జాతీయ పర్యాటకం సాదారణ స్థితికి చేరుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it