Telugu Gateway
Latest News

అమెరికా..చైనాలను దాటేసిన జపాన్ సూపర్ కంప్యూటర్

అమెరికా..చైనాలను దాటేసిన జపాన్ సూపర్ కంప్యూటర్
X

జపాన్ కొత్త సూపర్ కంప్యూటర్ ను ఆవిష్కరించింది. అది అమెరికా, చైనాల సూపర్ కంప్యూటర్ ల స్పీడ్ ను అధిగమించింది. దీంతో జపాన్ సూపర్ కంప్యూటర్ పై అందరిలో ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ఫ్యూగకు (Fugaku) సూపర్ కంప్యూటర్ ను ఫ్యూజిస్టు అభివృద్ధి చేసింది. ఈ ఫ్యూగకు సూపర్ కంప్యూటర్ కు ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన కంప్యూటర్ గా గుర్తింపు లభించింది. టాప్ 500 ప్రాజెక్టు చేపట్టిన సర్వేలో ఈ విషయం తేలింది.

ఏఆర్ఎం ఆధారిత రూమ్ సైజ్ లో ఉండే సూపర్ కంప్యూటర్ ను కోవిడ్ -19 పై పోరుకు ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త సూపర్ కంప్యూటర్ ఐబిఎం కంటే సెకండ్ లో 2.5 రెట్లు ఎక్కువ కాలుక్యేషన్లు చేస్తుందని తెలిపారు. ఫ్యూగకు గరిష్ట సామర్ధ్య పనితీరు 1000 పెటాఫ్లాప్స్ కంటే ఎక్కవ ఉంటుందని తెలిపారు. ఫెటాఫ్లాప్ అనేది కంప్యూటింగ్ స్పీడ్ ను గుర్తించే అంశం. జపాన్ అత్యాధునిక సూపర్ కంప్యూటింగ్ విషయంలో సాంకేతికంగా చాలా ముందంజలో ఉంది.

Next Story
Share it