జులై 15 వరకూ అంతర్జాతీయ విమానాలపై నిషేధం
BY Telugu Gateway26 Jun 2020 11:35 AM GMT

X
Telugu Gateway26 Jun 2020 11:35 AM GMT
ఎప్పుడెప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయా అని ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్రం జులై 15 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులుపై నిషేధం విధించింది. ఈ మేరకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)డిప్యూటీ డైరక్టర్ జనరల్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలు మాత్రం మామూలుగానే నడుస్తాయని తెలిపారు. దీంతో పాటు డీజీసీఏ అనుమతి పొందిన దేశాలకు అనుమతి ఇస్తారు.
అయితే ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో మాత్రం ప్యాసింజర్ షెడ్యూల్ విమానాలను అనుమతించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పౌరవిమానయాన శాఖ వివరాలు వెల్లడించనుంది. ఇఫ్పటికే దుబాయ్ జులై 7 నుంచి అంతర్జాతీయ పర్యాటకులను అనుతించనున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే దుబాయ్ కు సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Next Story