Telugu Gateway
Latest News

చైనాకు భారత్ షాక్

చైనాకు భారత్ షాక్
X

టిక్ టాక్ తో సహా 59 యాప్ లపై నిషేధం

భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ తో సహా మొత్తం 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది.ఈ మేరకు సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో టిక్ టాక్ పై నిషేధం విధించాలని డిమాండ్లు పెద్ద ఎత్తున ఉన్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో కేసులు కూడా దాఖలు అయ్యాయి. భారత్ -చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన తరుణంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ ప్రయోజనాలు, భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా భారత్ లో చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దేశానికి చెందిన ఇరవై మంది సైనికులు గల్వాన్ వద్ద జరిగిన ఘర్షణలో అమరులు అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది. భారత్ తాజాగా నిషేధం విధించిన జాబితాలో టిక్ టాక్ తోపాటు షేర్ ఇట్, క్వాయ్, బైదు మ్యాప్, షెహీన్, క్లాష్ ఆఫ్ కింగ్స్, డి యూ బ్యాటరీ సేవర్, హెలో, లైకీ, యూకామ్ మేకప్, ఎం కమ్యూనిటీ, సీఎం బ్రౌసర్స్ , వైరస్ క్లీనర్, వుయ్ చాట్ వంటివి ఉన్నాయి.

Next Story
Share it