Telugu Gateway
Latest News

బంగారం దిగుమతులు 99 శాతం డౌన్

బంగారం దిగుమతులు 99 శాతం డౌన్
X

భారతీయులకు చాలా ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి. ముఖ్యంగా దేశంలో మహిళలు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కొంటారు. అంతే కాదు..చాలా మంది పెట్టుబడుల పరంగా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తారనే విషయం తెలిసిందే. అలాంటి బంగారం కూడా మే నెలలో వెలవెలలాడింది. ఇది కూడా ఓ కారణంగా కావొచ్చు. దేశంలో గత కొంత కాలంగా బంగారం ధరలు జూమ్ జూమ్ అంటూ పెరిగాయి. మే నెలలో దేశ బంగారు దిగుమతులు 99 శాతం మేర తగ్గాయి. లాక్ డౌన్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎక్కడివి అక్కడే ఆగిపోవటం, ఆభరణాల షాప్ లు మూసి ఉండటం కూడా దీనికి కారణం.

గత ఏడాది మేలో భారత దేశంలో ఏకంగా 133.6 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా..2020 మేలో కేవలం 1.4 టన్నుల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంది. అన్ని రంగాల తరహాలో కరోనా ప్రభావం బంగారంపై కూడా పడింది. అంతే కాదు విలువ పరంగా చూస్తే గత ఏడాది దిగుమతి చేసుకున్న బంగారం విలువ 4.78 బిలియన్ అమెరికన్ డాలర్లు అయితే..ఈ సారి మాత్రం 76.31 మిలియన్ డాలర్లు మాత్రమే.

Next Story
Share it