Telugu Gateway
Latest News

భారత్ లో తొలి ‘ఫ్లాస్మా బ్యాంక్’ ఢిల్లీలో

భారత్ లో తొలి ‘ఫ్లాస్మా బ్యాంక్’ ఢిల్లీలో
X

దేశంలోనే తొలి ఫ్లాస్మా బ్యాంకు ఢిల్లీలో రానుంది. కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఫ్లాస్మాను ఇవ్వాలని కోరారు. ఇందుకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్మా చికిత్స చాలా చోట్ల మెరుగైన ఫలితాలు అందిస్తోంది. అందులో దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే.

ప్లాస్మా బ్యాంకు కరోనా బారిన పడిన వారిని కాపాడుందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కోలుకున్న ప్రతి వ్యక్తికి ఫోన్ చేసి ఫ్లాస్మా కోసం అభ్యర్ధిస్తుందని తెలిపారు. ఢిల్లీలో ఇప్పటికే 29 మంది ఫ్లాస్మా థెరపి ద్వారా చికిత్స అందించగా వారంతా కోలుకున్నారు. కరోనా సోకి కోలుకున్న వారి నుంచి రక్తాన్ని సేకరించి ఫ్లాస్మా థెరపి ద్వారా చికిత్స అందిస్తారు.

Next Story
Share it