Telugu Gateway
Latest News

హెచ్1 బీ వీసాలపై ట్రంప్ నిషేధం

హెచ్1 బీ వీసాలపై ట్రంప్ నిషేధం
X

అమెరికా ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ, హెచ్ 4 వీసాలు కొత్త గా ఇవ్వరాదని నిర్ణయించారు. ఇది 2020 డిసెంబర్ వరకూ అమల్లో ఉండనుంది. ఈ వీసాల్లో కోత వల్ల అమెరికన్లకే ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయంపై టెక్ కంపెనీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వలసదారులపై ఆధారపడి అభివృద్ధి అయిన దేశంలో ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదనే విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే ట్రంప్ కు ప్రస్తుతం ఎన్నికలు తప్ప మరేమీ కన్పించటం లేదు.అయితే ట్రంప్ తాజా నిర్ణయం భారతీయ ఐటి నిపుణులపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ట్రంప్ నిషేధం విధించిన రెండు వీసాలు ఐటి నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు చెందినవే. కరోనా కారణంగా అమెరికాలో ఉద్యోగాలు పెద్ద ఎత్తున పోయాయి. ప్రతి ఏటా అమెరికా ఇచ్చే హెచ్ 1 బీ వీసాల్లో 70 శాతం వరకూ భారతీయులకే వస్తాయి. ఇదిలా ఉంటే ట్రంప్ సీజనల్ వర్కర్స్ అయిన హె 2 బీ వీసాలపై కూడా నిషేధం విధించారు. అయితే ఇందులో ఫుడ్ ఫ్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేసే వారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు.

Next Story
Share it