Telugu Gateway
Latest News

రేట్లు తగ్గించండి...అమ్ముకోండి

రేట్లు తగ్గించండి...అమ్ముకోండి
X

రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కేంద్ర మంత్రి సూచన

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రియల్ ఎస్టేట్ డెవలపర్లకు సంచలన సూచన చేశారు. మార్కెట్ రికవరి అయ్యేంత వరకూ వేచిచూసే బదులు రేట్లు తగ్గించి అమ్ముకోవటమే బెటర్ అని సూచించారు. నిర్మాణదారులు ఎంత వీలైతే అంత మొత్తంలో ఇన్వెంటరీ (పూర్తయిన ఫ్లాట్స్) వదిలించుకుంటే అంత మంచిదని సూచించారు. మార్కెట్ లో ఒత్తిడి చాలా ఎక్కువ ఉందని..అత్యుత్తమ మార్గం రేట్లు తగ్గించి అమ్ముకోవటమే అని సూచించారు. ఓ వెబినార్ లో మాట్లాడుతూ పియూష్ గోయల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. డెవలపర్లు కేంద్రం వారి ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేయాలని కోరుకోవటం సరికాదన్నారు. మార్కెట్ రికవరి అయ్యే వరకూ ఆగాలంటే వారు చాలా కాలం వేచిచూడాల్సి ఉంటుందని అన్నారు.

కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ రంగం ఎప్పుడు కోలుకుంటుందో చెప్పటం కష్టంగా మారింది. కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ ధరలు కనీసం 15 నుంచి 20 శాతం మేర తగ్గుతాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వలస కార్మికులు ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోవటంతో నిర్మాణ రంగ పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. దీనికి తోడు వివిధ కారణాల కారణంగా సిమెంట్, ఇసుక ధరలు పెరగటం కూడా అసలే కష్టాల్లో ఉన్న నిర్మాణ రంగంపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story
Share it