Telugu Gateway
Latest News

ఆ లక్షణాలు ఉంటే ఆఫీసుకు రావొద్దు

ఆ లక్షణాలు ఉంటే ఆఫీసుకు రావొద్దు
X

కేంద్రం అప్రమత్తం అయింది. వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతుండటంతో మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు “కరోనా” బారిన పడడంతో నూతన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. “కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం” తమను తాము కాపాడుకోవడంతో పాటు, “కరోనా” వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలని పలు నిర్ణయాలు వెలువరించింది. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావద్దని ఆదేశించారు. ఎటువంటి ఆస్వస్థతలేని వారు మాత్రమే ఆఫీస్ కు రావాలి.

“కంటైన్మెంట్ జోన్” లలో నివసించే వారు “ఇంటి నుంచే” పని చేయాలి.20 మంది మాత్రమే ఆఫీస్ లో ఉండాలి. ఎదురెదురుగా (ఫేస్ టు ఫేస్) కూర్చోవద్దు. “ఇంటర్ కాం” లో నే మాట్లాడుకోవాలి. “వీడియో కాన్ఫరెన్స్” ద్వారానే సమావేశాలు నిర్వహించాలి.మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరి. మాస్కు పెట్టుకోకుంటే క్రమశిక్షణ చర్యలు.కామన్ ఏరియాలో ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలి. కంప్యూటర్ కీబోర్డ్ లు ఎవరికి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు.

Next Story
Share it