Telugu Gateway
Latest News

బీజింగ్ లో ఆగిపోయిన విమాన సర్వీసులు

బీజింగ్ లో ఆగిపోయిన విమాన సర్వీసులు
X

చైనాలో కరోనా కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అంతా అయిపోయింది. ఇక భయం లేదు అనుకుంటున్న సమయంలో బీజింగ్ లో ఈ వైరస్ కలకలం మొదలైంది. చైనా రాజధాని అయిన బీజింగ్‌ నగరంలో బుధవారం కొత్తగా 31 కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా సుమారు 1255 విమానాల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు నగరంలోని రెండు విమానాశ్ర‌యాలు ప్రకటించాయి. దీంతో బీజింగ్‌లో దాదాపు 70 శాతం విమాన రాక‌పోక‌లు ఆగిపోయినట్లు అయింది.

బీజింగ్‌లో తాజాగా ఓ మార్కెట్ నుంచి వైర‌స్ వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు ద్రువీక‌రించారు. గత 5 రోజుల్లోనే బీజింగ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. ఒక‌వేళ అత్య‌వ‌సం అనుకుంటే త‌ప్ప‌, బీజింగ్ ప్ర‌జ‌లు ఎవ‌రూ తమ ఇళ్ళు దాటి బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఆ న‌గ‌ర మున్సిప‌ల్ అధికారి చెన్ బీయి తెలిపారు. ఫెంగ్‌టాయి జిల్లాలో ఉన్న జిన్‌ఫాడి మార్కెట్ నుంచి అత్య‌ధిక సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు సమాచారం.

Next Story
Share it