Telugu Gateway
Latest News

అమెజాన్ బోనస్ ప్రకటన

అమెజాన్ బోనస్ ప్రకటన
X

ఓ పక్క కరోనా దెబ్బకు ఉద్యోగాలు పోతున్నాయి. చాలా చోట్ల ఉన్న ఉద్యోగాల్లోనూ వేతనాల్లో కోత పడుతోంది. దేశ వ్యాప్తంగా ఎప్పుడు ఎవరి ఉద్యోగాలకు ఎసరు వస్తుందో తెలియని టెన్షన్. ఈ తరుణంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగులకు అత్యంత శుభవార్త చెప్పింది. అదీ కరోనా కష్ట కాలంలో. ఏకంగా ఈ సంస్థ ఉద్యోగులకు దాదాపు 3775 కోట్ల రూపాయల మేర బోనస్ అందజేయనుంది. ఈ కష్టకాలంలో ఎంతో శ్రమించి పనిచేస్తున్న వారికి ఒక్కసారిగా ఈ బోనస్ అందజేయనున్నారు.

ఒకొక్కరికి 11,300 రూపాయల నుంచి గరిష్టంగా 2.26 లక్షల రూపాయల వరకూ బోనస్ అందనుంది. జూన్ వరకూ పనిచేసిన వారికి ఈ బోనస్ వర్తింపచేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో అమెరికా వంటి దేశాల్లో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్ని రకాల అవసరాలకు ఆన్ లైన్ సంస్థలపై ఆధారపడుతున్నారు. అయితే అమెజాన్ పలు జాగ్రత్తలు తీసుకుంటూ వినియోగదారులకు సేవలందిస్తోంది.

Next Story
Share it