Telugu Gateway
Latest News

రిలయన్స్ జియోలోకి మరో రూ. 11,367 కోట్ల పెట్టుబడి

రిలయన్స్ జియోలోకి మరో రూ. 11,367 కోట్ల పెట్టుబడి
X

ఫస్ట్ ఫేస్ బుక్..తర్వాత సిల్వర్ లేక్..ఇప్పుడు విస్టా ఈక్విటీ

మూడు వారాల్లోనే 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు

ఫస్ట్ ఫేస్ బుక్. తర్వాత సిల్వర్ లేక్. ఇప్పుడు అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్. ఇలా రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్ లోకి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. గత నెల వ్యవధిలోనే ఈ ఒక్క కంపెనీలోకి ఏకంగా 60,596 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటే రిలయన్స్ జియో రేంజ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు..రిలయన్స్ జియో శుక్రవారం ఉదయమే విస్టా ఈక్విటీ పెట్టుబడుల అంశాన్ని వెల్లడించింది. ఈ కంపెనీ జియో ఫ్లాట్ ఫామ్స్ పై 11,367 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి ద్వారా జియో ఫ్లాట్ ఫామ్స్ లో విస్టాకు 2.32 శాతం వాటా దక్కనుంది. రిలయన్స్, ఫేస్ బుక్ తర్వాత ఈ ఫ్లాట్ ఫామ్స్ లోకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి విస్టాదే కానుంది.

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలోని 130 మంది ప్రజలకు ఓ సమర్ధవంతమైన ఫ్లాట్ ఫాంను అందించే దిశగా జియో సన్నాహాలు చేస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా చిన్న, సూక్ష్మ వ్యాపారులు, రైతులకు కూడా ఉపయోగపడేలా పలు మార్పులు తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రముఖ పెట్టుబడి సంస్థ అయిన విస్టా సాఫ్ట్ వేర్, డేటా, టెక్నాలజీ ఆధారిత కంపెనీలపై దృష్టి సారించిందని తెలిపారు. ఈ డీల్ పై రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ విస్టా లాంటి విలువైన భాగస్వామిని సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు ప్రకటించారు.ఇతర భాగస్వాముల తరహాలోనే విస్టా కూడా దేశ డిజిటల్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. చట్టబద్దమైన అనుమతుల తర్వాత విస్టా పెట్టుబడులకు ఆమోదం లభించనుందని కంపెనీ వెల్లడించింది.

Next Story
Share it