ఉబెర్ ఇండియా..600 మంది ఉద్యోగుల తొలగింపు
BY Telugu Gateway26 May 2020 6:45 AM GMT

X
Telugu Gateway26 May 2020 6:45 AM GMT
ఉబెర్ ఇండియా భారత్ లో 600 మంది ఉద్యోగులను తొలగించింది. వీరందరూ పర్మినెంట్ ఉద్యోగులే. తొలగించిన ఉద్యోగులు దేశంలోని మొత్తం సిబ్బందిలో 25 శాతంతో సమానం. కరోనా కారణంగానే ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో కొంత మంది డ్రైవర్లతోపాటు రైడర్ సపోర్ట్ ఆపరేషన్స్ సిబ్బంది ఉన్నారని ఉబెర్ ఇండియా సౌత్ ఏషియా ప్రెసిడెంట్ ప్రదీప్ పరమేశ్వరన్ వెల్లడించారు.
కరోనా ప్రభావం కంపెనీపై అంచనాలకు అందని విధంగా ఉందని..అందుకే ఉద్యోగుల తొలగింపు తప్పలేదన్నారు. దేశంలో నాలగవ విడత లాక్ డౌన్ గడువు ముగియనున్న తరుణంలో ఉబెర్ ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో క్యాబ్ సర్వీసులకు అనుమతి కూడా మంజూరు చేశారు. అయినా కూడా పలు సంస్థలు మార్కెట్ సాదారణ స్థితికి ఎప్పుడు వస్తుందో అన్న టెన్షన్ తో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
Next Story