Telugu Gateway
Latest News

మూడు నిమిషాల జూమ్ కాల్..3500 మందిపై వేటు

మూడు నిమిషాల జూమ్ కాల్..3500 మందిపై వేటు
X

కరోనా కష్టాలు మామూలుగా లేవు. అది బహుళ జాతి సంస్థా..దేశీయ సంస్థా అన్న తేడా లేదు. ఉద్యోగులపై వేటు పడుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారే పరిస్థితులు సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా ఉబెర్ మూడు నిమిషాల వ్యవధిలో ఏకంగా 3500 మందిపై వేటు వేసింది. అది జూమ్ కాల్ లోనే ఈ విషయం చెప్పేసింది. బహుశా ఈ తరహా ఉద్యోగుల తొలగింపు ఉబెర్ దే అయి ఉండొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఆ ప్రభావం ఉబెర్ పై కూడా పడింది.

ఉబెర్ ఒక్క కాల్ తో వీరందరిని విధుల్లో నుంచి తొలగిస్తూ ..ఇదే మీ చివరి పని దినం అని చెప్పేయటంతో అవాక్కు అవటం ఆ సంస్థ ఉద్యోగుల వంతు అయింది. తాజాగా తొలగించిన 3500 మంది ఉద్యోగులు కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 14 శాతం. ఉబెర్ కస్టమర్ సర్వీస్ హెడ్ రుఫిన్ చావెల్ ఈ విషయం ఉద్యోగులకు చెబుతూ బోరున విలపించింది. ఎవరూ కూడా ఇలాంటి కాల్ రావాలని కోరుకోరని ఆమె వ్యాఖ్యానించింది.

Next Story
Share it