స్విగ్గీ ..1100 మంది ఉద్యోగుల తొలగింపు
BY Telugu Gateway19 May 2020 4:44 AM GMT

X
Telugu Gateway19 May 2020 4:44 AM GMT
ప్రముఖ ఆన్ లైన్ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడింది. అది ఎంతలా అంటే సంస్థ ఏకంగా 1100 మంది ఉద్యోగులను తప్పించేంత. స్విగ్గీ ప్రధాన కార్యాలయం ఉన్న బెంగుళూరుతోపాటు వివిధ హోదాలు, నగరాల్లో స్విగ్గీకి చెందిన 1100 మంది ఉద్యోగులను తప్పిస్తున్నట్లు కంపెనీ సీఈవో శ్రీహర్ష మాజేటి ఉద్యోగులకు పంపిన మెయిల్ లో తెలిపారు.
స్విగ్గీ కంపెనీకి సంబంధించినంత వరకూ ఇది అత్యంత విచారకరమైన రోజు అని తన మెయిల్ లో పేర్కొన్నారు. ఆహార సరఫరా వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నదని తెలిపారు. అయితే తొలగించిన ఉద్యోగులు అందరికీ కనీసం మూడు నెలల వేతనం అందజేయనున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే ప్రముఖ సంస్థ ఉబెర్ కూడా అంతర్జాతీయంగా వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
Next Story