Telugu Gateway
Latest News

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ
X

హీరో..హీరోయిన్ల పుట్టిన రోజులు వచ్చాయంటే వాళ్ల ఫ్యాన్స్ కు సందడే సందడి. ఎందుకంటే ఆ సమయంలో ట్రాక్ లో ఉన్న సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ప్రచారం చేసుకోవటంతోపాటు ఫ్యాన్స్ ను కూడా కుషీ చేస్తారు. దీని వల్ల చిత్ర యూనిట్ కు రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ ట్రెండ్ టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్నదే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఓ అప్ డేట్ ఇచ్చింది. మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా వీడియో ఏదైనా విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ వారి ఆశలు నిరాశగానే మిగలబోతున్నాయి.

లాక్ డౌన్ ను మరోసారి పొడిగించటం వల్ల ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తిగా ఎక్కడివి అక్కడే ఆగిపోయాయని..అందుకే ఏదో చేశామంటే చేశామని ప్రయత్నాలు చేయటం లేదని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఇన్ని రోజులు ఎదురుచూసిన ఎదురుచూపులు మర్చిపోయేలా ఎన్టీఆర్ కు సంబంధించిన అప్ డేట్ ఇస్తామని తెలిపారు. ఆర్ఆర్ఆర్ లో మరో హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it