Telugu Gateway
Latest News

లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు

లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు
X

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో రెండు వారాలు అంటే మే 17 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి మే 3తో ఇంతకు ముందు ప్రకటించిన లాక్ డౌన్ ముగియనుంది. ఈ తరుణంలో సమగ్ర సమీక్ష తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ నోట్ ను విడుదల చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం ఏ జిల్లా ఏ జోన్ లో ఉన్నా కూడా విమాన సర్వీసులు, రైలు, మైట్రో, రోడ్డు మార్గంలో అంతర్ రాష్ట్ర రవాణా, స్కూళ్లు, కాలేజీలు తెరవటం, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు, జిమ్నాజియాలు, మత కేంద్రాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతించరు.

విమానాలు కానీ రైళ్లు, బస్సు సర్వీసులు ఎక్కడైతే హోం మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన వాళ్లకు అనుమతిస్తుందో అక్కడ మాత్రమే నడుస్తాయని నూతన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అత్యవసరం కాని అన్ని సర్వీసులను రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ ఏ మాత్రం అనుమతించబోమని ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలాంటి మినహాయింపులు లేకుండా ఈ మార్గదర్శకాలను పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరేంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఆరేంజ్‌ జోన్లలో కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి. ఆరేంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవని తెలిపారు.

Next Story
Share it