కోల్ కతా విమానాశ్రయంల్లో అల్లకల్లోలం
BY Telugu Gateway21 May 2020 4:35 PM IST
X
Telugu Gateway21 May 2020 4:35 PM IST
అంపన్ తుఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ వణుకుతోంది. కోల్ కతా విమానాశ్రయం కూడా ఈ తుఫాన్ కారణంగా భారీగా నష్టపోయింది. టెర్మినల్ భవనంతోపాటు ఈ విమానాశ్రయంలో పార్క్ చేసిన పలు విమానాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ నీటిలో మునిగింది. ఎయిర్‌పోర్టు నీటితో నిండిపోవడంతో విమానాశ్రయం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
నీటితో నిండిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు దృశ్యాలు చూస్తుంటే పెను తుపాన్ అంపన్ ఎంత విధ్వంసం సృష్టించిందో తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా కంటే అంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ కు ఎక్కువ నష్టం చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు ఈ నష్టం ఎంతో కూడా ఇప్పుడే చెప్పలేమన్నారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో 12 మంది మృత్యువాత పడ్డారు.
Next Story