Telugu Gateway
Latest News

దేశమంతటా కరోనా యోధులపై పూలవర్షం

దేశమంతటా కరోనా యోధులపై పూలవర్షం
X

దేశం ఇప్పుడు వాళ్ళకు సెల్యూట్ చేస్తోంది. ఎందుకంటే ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తున్న తరుణంలో ప్రాణాలకు తెగించి మరీ బాధితులను కరోనా నుంచి విముక్తి కలిగిస్తున్నది వాళ్లే. అందుకే డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ఇలా ఎన్నో కీలక విభాగాలను ఇప్పుడు కరోనా వారియర్స్ గా పిలుస్తున్నారు. ఇలాంటి వారికి సంఘీభావం తెలిదుకు దేశాన్ని కాపాడే త్రివిధ దళాలు కూడా ముందుకొచ్చాయి. దేశంమంతటా వారిపై పూల వర్షం కురిపించాయి. ఇదే కార్యక్రమం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలోనూ కొనసాగింది. వైద్యులు, పారామెడికల్‌, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా సాయుధ దళాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీస్‌ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి వందన సమర్పరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పోలీసు సేవలకు ప్రశంసగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కు చెందిన చాపర్‌ పోలీస్‌ వార్‌ మెమోరియల్‌పై పూలవర్షం కురింపించింది. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల్లో కోవిడ్‌ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురిపిస్తున్నారు. హైదరాబాద్ లో కరోనా సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రితో పాటు రాత్రి, పగలు తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు, వైద్యులు, పారామెడికల్‌, పారిశుద్య సిబ్బందికి వాయుసేన హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిపిస్తూ తమ సంఘీభావం ప్రకటించారు.

వాయుసేన పూలవర్షం కురిపించిన అనంతరం వైద్యులు చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. విశాఖపట్నంలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న ప్రభుత్వ చెస్ట్‌ ఆసుపత్రిపై వాయుసేన పూలవర్షం కురిపించింది. కరోన యోధులకు పూల జల్లులు, పుష్పగుచాలతో తమదైన రీతిలో అభినందనలు వెల్లువెత్తాయి. వైద్యులకు, నర్సులకు, పారమెడికల్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు తూర్పు నౌకదాలం ఏపి ఆఫీసర్ ఇంచార్జి కమాండర్ సంజీవ్ ఇస్సార్ ఫుష్ప గుచ్చాలు అందించారు. ఆదివారం సాయంత్రం రెండు యుద్ధనౌకల్లో విద్యుత్ దీపాలు వెలిగించి నేవీ సిబ్బంది కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలపనున్నారు.

Next Story
Share it