Telugu Gateway
Latest News

కరోనా వ్యాక్సిన్ వచ్చినా ఇంత మంది రారేమో..!

కరోనా వ్యాక్సిన్ వచ్చినా ఇంత మంది రారేమో..!
X

కిలోమీటర్ల కొద్దీ క్యూలు. సర్కారు చెప్పిన ఐదుగురి నిబంధన ఎక్కడ చూసినా కన్పించదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది. వచ్చి వేయించుకోండి అన్నా కూడా మొదటి రోజు అంత మంది బయటకు రారేమో. కానీ మద్యం షాపుల దగ్గర క్యూలు చూసిన వారందరూ అవాక్కు అవ్వాల్సిందే. ఈ నలభై రోజుల లాక్ డౌన్ పీరియడ్ లో ఏ నిత్యావసర వస్తువుల దగ్గర కూడా ఇంత భారీ క్యూలు లేవు. కానీ సోమవారం నాడు తెరిచిన మద్యం షాపుల దగ్గర మాత్రం కిలోమీటర్ల కొద్దీ క్యూలు దర్శనం ఇస్తున్నాయి.

ఈ మందు తపన ముందు కరోనా భయం వాళ్ళలో ఎక్కడైనా మచ్చుకైనా కన్పించటం లేదు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా తమ మందు యజ్ణం కోసం మాత్రం అందరూ ఇలా క్యూలు కట్టారు. సర్కారు పెంచిన ధరలను కూడా ముందు బాబులు లెక్క చేయటం లేదు. ఇంత విరామం తర్వాత వచ్చిన సదవకాశం అన్నట్లు అందరూ తమ పని పూర్తి చేసుకునే పనిలో పడ్డారు.. మరి తొలి రోజు ఈ లిక్కర్ సేల్స్ లెక్కలు ఎన్ని రికార్డులు నమోదు చేస్తాయో వేచిచూడాల్సిందే. మందు షాప్ ల దగ్గర ఈ భారీ క్యూలు ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో దర్శనం ఇచ్చాయి.

Next Story
Share it