Telugu Gateway
Latest News

గగనతలంలో విమానాలు ఇలా తిరిగాయి

గగనతలంలో విమానాలు ఇలా తిరిగాయి
X

భారతీయులు మళ్లీ గాలిలో ఎగరటం ప్రారంభించారు. తొలి రోజు విమానాలు ఇలా తిరిగాయి. అదిగో తొలి రోజు ఆకాశంలో విమానాలు ఎలా తిరుగుతున్నాయో చూడండి అంటూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కొన్ని ఫోటోలను ట్విట్టర్ వేదిక విడుదల చేశారు. రెండు నెలల విరామం తర్వాత దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కావటంతో పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తోంది.

అందుకే ఆయన ఎంతో ఆనందంగా ఫ్లైట్ రాడార్ తీసిన చిత్రాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. దేశంలో తొలి రోజు ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి. అందమైన లైవ్ చిత్రాలను క్యాప్చర్ చేసింది ఇదిగో అంటూ ఈ ఫోటోలు విడుదల చేశారు. దేశీయ విమానయాన సర్వీసులు ప్రారంభం కావటంతో ఆకాశం ఎలా బిజీగా ఉందో చూడండి అని మంత్రి పేర్కొన్నారు. తొలి రోజు ప్రయాణికుల లేక పలు సర్వీసులు కూడా రద్దు అయ్యాయి.

Next Story
Share it