Telugu Gateway
Latest News

ప్రపంచ వ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలకు బ్రేక్

ప్రపంచ వ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలకు బ్రేక్
X

అత్యవసరం అయితే తప్ప..ఎవరూ ఇప్పుడు ఆస్పత్రి వైపు అడుగుపెట్టడానికి కూడా భయపడుతున్నారు. కారణం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ తో ప్రస్తుతం ప్రపంచం అంతా గడగడలాడిపోతోంది. అందుకే ఎవరూ ఆస్పత్రి వైపు వెళ్లటం లేదు. ఈ కారణంగానే ఇప్పటికే ఖరారు అయిన 2.8 కోట్ల సర్జరీలు రద్దు/వాయిదా పడినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ వివరాలను ఓ బ్రిటీష్ జర్నల్ లో ప్రచురించారు. ప్రపంచ వ్యాప్తంగా సర్జన్లు, అనస్థియన్ల దగ్గర నుంచి వివరాలు సేకరించి ఈ మేరకు ఓ అంచనాకు వచ్చారు. ఇందులో 77 దేశాలకు చెందిన డాక్టర్లు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా 38 శాతం మేర క్యాన్సర్ ఆఫరేషన్లు కూడా రద్దు/వాయిదా పడ్డాయని తెలిపారు.

దేశీయంగా కూడా చాలా మంది కరోనా బయంతో చాతీ నొప్పి వంటి సమస్యలు ఉన్నా కూడా ఆస్ప్రతుల వైపు వెళ్లకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో అనారోగ్య కారణాలతో కూడిన మరణాలు పెరిగాయి. దీనికి కారణం చాలా రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేయటం కూడా ఒక కారణంగా ఉంది. అత్యవసరం అయితే ఇతర సేవలు అన్నీ నిలిపివేశారు. తర్వాత వచ్చిన సడలింపుల్లో ఇఫ్పుడు ఓపీ సేవలను అనుమతించారు.

Next Story
Share it