Telugu Gateway
Latest News

ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్

ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్
X

ఎయిర్ ఇండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతోంది. వీరితోపాటు ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ ఎల్)కు చెందిన ఇద్దరు సాంకేతిక సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి రప్పించేందుకు ఎయిర్ ఇండియా ఒక్కటే ఇఫ్పుడు ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఇలాంటి విమానాలు నడిపే ప్రతి ఒక్కరికి ముందు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని..అయితే ఇది టెస్టింగ్ కిట్స్ పొరపాటు వల్ల కూడా జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

కరోనా పాజిటివ్ గా తేలిన పైలట్లు అందరూ బోయింగ్ 787 విమానాలు నడిపేవారే. గత మూడు వారాలుగా వీళ్ళు ఎలాంటి విమానాలు నడపలేదని..ఏప్రిల్ 20 ముందు మాత్రం చైనాకు కార్గో విమానాలు తీసుకెళ్లినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ గా తేలిన సాంకేతిక సిబ్బందిని కూడా ప్రస్తుతం విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. వీరు పూర్తిగా కోలుకునే వచ్చే వరకూ ఎలాంటి బాధ్యతలు అప్పగించరని తెలిపారు. త్వరలోనే దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని భావిస్తున్న తరుణంలో ఈ వ్యవహారం మరింత ఆందోళన పెంచుతోంది.

Next Story
Share it