Telugu Gateway
Latest News

హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడుతున్నా

హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడుతున్నా
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కరోనా వైరస్ సోకకుండా తాను హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్యాట్లెట్స్ వాడుతున్నట్లు ప్రకటించారు. ఈ పిల్ ను సుదీర్ఘకాలంగా వాడుతున్నారని..మలేరియా నివారణ కోసం దీన్ని గత 30 నుంచి 40 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ పిల్ ను పెద్ద ఎత్తున టెస్ట్ చేశారని..అందుకే దైర్యంగా వాడుతున్నని తెలిపారు. ఇది చాలా మంచిది అని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ తాను అంతా బాగానే ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.

ఓ దేశ అధ్యక్షుడు కరోనా నివారణ కోసం ఇలా హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్యాబ్లెట్ వాడుతున్ననని చెప్పటం ఇదే మొదటిసారి. ఈ ట్యాబ్లెట్ల కోసం ట్రంప్ ఏకంగా భారత్ ను హెచ్చరించిన తరహాలో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తొలుత ఈ మందుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన భారత్ తర్వాత కరోనా బాధిత దేశాలకు సరఫరా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story
Share it