టీవీ5 కార్యాలయంపై దాడి
BY Telugu Gateway9 May 2020 6:11 AM GMT

X
Telugu Gateway9 May 2020 6:11 AM GMT
హైదరాబాద్ లోని టీవీ5 కార్యాలయంపై శనివారం నాడు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కొంత మంది కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కార్యాలయంలోని కొన్ని అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు? ఎందుకు దాడికి దిగారు అన్న అంశాలు తెలియాల్సి ఉంది. టీవీ5 కార్యాలయంపై దాడిని తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు నేతలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
Next Story