Telugu Gateway
Latest News

శక్తివంచన లేకుండా అత్యవసర వ్యర్ధాల నిర్వహణ

శక్తివంచన లేకుండా అత్యవసర వ్యర్ధాల నిర్వహణ
X

దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న తరుణంలో కూడా తాము అత్యవసరాల వ్యర్ధాల నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని రామ్ కీ ఎన్వీరో వెల్లడించింది. సమగ్రమైన పర్యావరణ నిర్వహణ సేవలను అందించడంలో ఆసియాలో అగ్రగామిగా ఉంది ఈ సంస్థ. రామ్ కీ ఎన్విరో తమ 15వేల మంది ఉద్యోగులతో దేశవ్యాప్తంగా 25 ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 20వేల మంది సిబ్బందితో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కోవిడ్-19 తో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంతో పాటుగా భారతీయ కమ్యూనిటీలకు మద్దతునందించడంలో భాగంగా సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రామ్కీ అభివృద్ధి చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా కీలకమైన అందించబోయే కీలకమైన సేవల్లో వైద్య వ్యర్ధాల నిర్వహణ, వ్యర్థాల సేకరణ, వ్యర్థాల శుద్ధి ..నాశనం, ల్యాండ్‌ఫిల్స్ నిర్వహణ, ప్రమాదకరమైన వ్యర్థాలను నాశనం చేయడం ఉన్నాయని కంపెనీ తెలిపింది.

కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ గౌతమ్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ"సమాజం, స్థానిక కమ్యూనిటీలు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ క్లిష్ట సమయంలో మద్దతునందించడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుండటం పట్ల రామ్ కీ ఎన్విరో బృందం గర్వంగా ఉంది. ఈ మహమ్మారి స్టేజ్ 3లోకి ప్రవేశించకుండా చేయడానికి అవసరమైన చర్యలన్నీ భారతదేశం తీసుకుంటున్న వేళ, వ్యర్థాల సేకరణ మరియు నిర్వహణ సేవలను కొనసాగించే పరిష్కారాలలో మేము కూడా భాగం కావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Next Story
Share it