Telugu Gateway
Latest News

వ్యాక్సిన్ వచ్చే వరకూ టెన్షన్ టెన్షనే!

వ్యాక్సిన్ వచ్చే వరకూ టెన్షన్ టెన్షనే!
X

డబ్ల్యుహెచ్ వో సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వైరస్ ముప్పు ఇప్పటికిప్పుడే ప్రపంచాన్ని వీడే అవకాశం లేదని..వ్యాక్సిన్ వచ్చే వరకూ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి డేవిడ్ నాబర్రో కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ తగ్గినట్లు కన్పించినా అది మళ్ళీ రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయని..అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విషయంలో దేశాలన్నీ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటికప్పుడు రోగులను గుర్తించి వారికి వైద్యసేవలు అందించాల్సి ఉంటుందన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని..చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

డబ్ల్యుహెచ్ వో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు..ఈ సంస్థకు తాము నిధుల విడుదలను కూడా నిలిపివేస్తామని ప్రకటించారు. ఈ వ్యవహారంపై డేవిడ్ నాబర్రో స్పందించారు. అమెరికాతో భాగస్వామ్యం కొనసాగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అమెరికా ప్రతి ఏటా డబ్ల్యుహెచ్ వో కు 500 మిలియన్ డాలర్ల నిధులను అందజేస్తుంది. భారత్ తోపాటు పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొనే విషయంలో చాలా బిజీగా ఉన్నాయి. ఈ సంవత్సరాంతానికి వైరస్ అందుబాటులోకి రావొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోడీ కూడా రాబోయే రోజుల్లో జీవితం అంత సాఫీగా ఏమీ ఉండదని..కరోనాకు ముందు..కరోనా తర్వాత అన్న మార్పులు స్పష్టంగా ఉంటాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Next Story
Share it