Telugu Gateway
Latest News

చైనా నుంచి భారీ నష్టపరిహారం వసూలు చేస్తాం

చైనా నుంచి భారీ నష్టపరిహారం వసూలు చేస్తాం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మనీ కోరుతున్నట్లు 130 బిలియన్ యూరోల కంటే తాము ఆ దేశం నుంచి చాలా ఎక్కువే వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా పాత్రపై అమెరికా చాలా తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరపనుందని ట్రంప్ ప్రకటించారు. తొలి దశలోనే కరోనా వైరస్ ను అరికట్టే ఛాన్స్ ఉన్నా..చైనా అలా చేయలేదని అన్నారు. ఈ కారణంగానే అమెరికా తో సహా ప్రపంచం యావత్తు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ట్రంప్ మండిపడ్డారు.

ఆర్ధిక వ్యవస్థలు అన్నీ కుప్పకూలాయని..ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. చైనా తీరుతో అమెరికా ఏ మాత్రం సంతృప్తిగా లేదన్నారు. నిజంగా కరోనా వైరస్ లీక్ కు చైనా ఏమైనా కారణం అని తేలితే మాత్రం ఈ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటివరకూ దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఏమీ లభించలేదు. కాకపోతే ఈ దిశగా మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it