Telugu Gateway
Latest News

దుబాయ్ న్యూ టెక్నాలజీ..జ్వరాన్ని గుర్తించే ‘స్మార్ట్ హెల్మెట్స్’

దుబాయ్ న్యూ టెక్నాలజీ..జ్వరాన్ని గుర్తించే ‘స్మార్ట్ హెల్మెట్స్’
X

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ‘స్మార్ట్ హెల్మెట్స్’ను తెరపైకి తీసుకొచ్చింది. కరోనా కలకలం రేపుతున్న తరుణంలో వేగంగా జ్వర బాధితులను గుర్తించేందుకు ఈ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం విమానాశ్రయాలతోపాటు పలు చోట్ల ప్రయాణికుడికి జ్వరం (టెంపరేచర్) ఉందా లేదా అని తెలుసుకోవటానికి సంప్రదాయ పద్దతిలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ హెల్మెట్స్ తో ప్రతి వ్యక్తిని అలా ఆపి పరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్ గా ఇది వ్యక్తి టెంపరేచర్ ను గుర్తిస్తుంది. ఒక వ్యక్తి ఐదు మీటర్లు (16 అడుగులు) దూరంలో ఉన్నప్పుడే ఈ స్మార్ట్ హెల్మెట్ సంబంధిత వ్యక్తి టెంపరేచర్ ను కనిపెట్టేస్తుంది. అంతే కాదు నిమిషంలో ఏకంగా 200 మంది టెంపరేచర్లను ఇది రిజిస్టర్ చేయగలదు అని ‘రాయిటర్’ సంస్థ తెలిపింది.

కరోనా కలకలం ఉన్న తరుణంలో ఎవరికైనా జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వారిని మరిన్ని పరీక్షలకు పంపుతారు. చైనాకు చెందిన కె సీ వేరబుల్ కంపెనీ మధ్యప్రాచ్య దేశాలతోపాటు యూరప్, ఏషియాలకు వెయ్యి స్మార్ట్ హెల్మెట్లను విక్రయించినట్లు తెలిపింది. ఈ సంక్షోభ సమంయలో దుబాయ్ లో పలు చోట్ల ఇదే విధానాన్ని అనుసరించారు. దుబాయ్ పోలీసులు ప్రస్తుతం వీటిని ఉపయోగిస్తూ జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వలస వచ్చిన కార్మికులు ఉండే ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించి బాధితులను గుర్తిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=cHW3_qTIUto

Next Story
Share it