Telugu Gateway
Latest News

కరోనాతో ఆయనకు కలిసొచ్చిన మొత్తం 28 వేల కోట్లు

కరోనాతో ఆయనకు కలిసొచ్చిన మొత్తం 28 వేల కోట్లు
X

ప్రపంచం అంతా ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సంపన్నుల ఆస్తి అలా అలా గాల్లో కలసిపోతోంది. కానీ ఆయనకు మాత్రం కరోనా కలిసొచ్చింది. అలా ఇలా కాదు. ఏకంగా 28 వేల కోట్ల రూపాయల మేర సంపద సృష్టించి పెట్టింది. అందరినీ నష్టాల పాలు చేసిన కరోనా ఆయనకు మాత్రం భారీ ఎత్తున సంపద తెచ్చి పెట్టింది. ఆయన ఒక్కడే కరోనా కారణంగా ఏకంగా 28 వేల కోట్ల రూపాయల మేర లాభపడ్డాడు. ఇఫ్పటికే సింగపూర్ లో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న ఆయనకు ఇప్పుడు మరో 28,000 వేల కోట్ల రూపాయల సంపద యాడ్ అయింది. ఇంతకీ ఆయన చేసే వ్యాపారం ఏంటి అంటారా?. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్లతోపాటు ఇతర ప్రాణాలను కాపాడే వైద్యపరికరాల డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఇదే ఆయనకు ఇప్పుడు వరంగా మారింది. ఈ కారణంగానే షెన్ జెన్ మిండ్రే బయో మెడికల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షేర్లు ఏకంగా 41 శాతం మేర పెరిగాయి.

ఈ కారణంగానే కంపెనీ ఛైర్మన్, సింగపూర్ లో సంపన్న వ్యక్తిగా ఉన్న లి జిటింగ్ సంపద సుమారు 28 వేల కోట్ల (3.7 బిలియన్ డాలర్ల) మేర పెరిగిందని ‘బ్లూమ్ బెర్గ్’ వెల్లడించింది. కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం ఏర్పడటంతో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యం పాలైన వారిని రక్షించేందుకు వెంటిలేటర్లు అవసరం పడతాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంటిలేటర్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పలు కంపెనీలు కూడా వెంటిలేటర్ల ఉత్పత్తిని ఇఫ్పుడు పెద్ద ఎత్తున పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ లో అత్యధిక కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరగటంతో అక్కడ వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. వెంటిలేటర్లు లేక కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతుతున్నారు.

Next Story
Share it