Telugu Gateway
Latest News

పిల్లలు స్కూళ్ళకు ఇక ఇలా వెళ్ళాల్సిందేనా?!

పిల్లలు స్కూళ్ళకు ఇక ఇలా వెళ్ళాల్సిందేనా?!
X

ఇప్పటివరకూ స్వేచ్చగా...హాయిగా నవ్వుకుంటూ స్కూళ్ళకు వెళ్లిన పిల్లలు రాబోయే రోజుల్లో అలా వెళ్ళలేరా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయం ఇప్పటికిప్పుడు తొలగిపోయేలా లేదు. ఇదే ఎంతో మంది తల్లితండ్రుల్లో ఆందోళనకు కారణం అవుతోంది. అసలు విద్యా సంవత్సరం కూడా ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తెలియని టెన్షన్ చాలా మందిలో ఉంది. చైనా కూడా కరోనా నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తేరుకంటోంది. అక్కడ కూడా కొన్ని స్కూళ్ళు కూడా తెరుచుకుంటున్నాయి. కరోనా వైరస్ పుట్టుక కేంద్రమైన వుహాన్ లోనూ సాదారణ జీవితం ప్రారంభం అయినా అక్కడ ప్రజల్లో మాత్రం ఇంకా భయం పోలేదు. చైనాలోని ఓ స్కూల్ లో పాఠశాలకు హాజరైన పిల్లలను పైన చిత్రంలో చూడొచ్చు. మాస్క్ లు ధరించటమే కాకుండా..మొహం మొత్తం కవర్ అయ్యేలా ఓ రక్షణ గ్లాస్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మన హెల్మెట్ కు ఉన్న గ్లాస్ తరహాలోనే అది కూడా ఉంది. ఒక్క వైరస్ దెబ్బకు జీవితం పూర్తిగా మారిపోబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లు భారత్ లో కూడా జీవితం కరోనాకు ముందు...కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి.

ఓ వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కూడా ఇంకా చాలా మందికి అసలు కరోనా వైరస్ గురించి అర్దం కావటంలేదని..రాబోయే రోజుల్లో ఈ ప్రమాదం మరింత పొంచి ఉందని హెచ్చరిస్తోంది. కరోనాకు సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి..ఇక ఏమీ కాదు..ఎవరూ భయపడాల్సిన పనిలేదు అని చెప్పే దాకా అందరికీ టెన్షన్ తప్పేలా లేదు. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?. దీనిపై రకరకాల అధ్యయనాలు. కొంత మంది అయితే అసలు ఏడాది వరకూ వ్యాక్సిన్ గురించి మర్చిపోవటమే అంటున్నారు. మరి కొంత మంది అయితే ఆరు నెలల్లో వచ్చేస్తుంది అంటున్నారు. కరోనా వైరస్ పుట్టిన చైనా దేశం వైరస్ కనిపెట్టే పనిలోనూ చాలా స్పీడ్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కరోనాకు వ్యాక్సిన్ ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా తీసుకొచ్చి ప్రజలందరికీ పాత స్వేచ్చ లభించాలని ఆశించటం తప్ప..ప్రస్తుతం ఎవరూ చేయగలిగింది ఏమీలేదు.

Next Story
Share it