Telugu Gateway
Latest News

ఎయిర్ ఇండియా తప్ప..అన్ని ఎయిర్ లైన్స్ రెడీ

ఎయిర్ ఇండియా తప్ప..అన్ని ఎయిర్ లైన్స్ రెడీ
X

అందరిలో ఒకటే టెన్షన్. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తారా..లేదా?. ఎందుకంటే ఇప్పటికే లాక్ డౌన్ లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంత సుదీర్ఘకాలంగా ప్రజలు కేవలం ఇళ్ళకే పరిమితం అయిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు కూడా. అందుకే ప్రజలు ఒకింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కారణంతోనే లాక్ డౌన్ ఎత్తివేత ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏప్రిల్ 14 నాటికి దేశమంతా కరోనా వైరస్ కేసులు పూర్తిగా తగ్గిపోవాలని అందరూ మనసులో దేవుడిని వేడుకొంటున్నారు. ఎందుకంటే అది కంట్రోల్ లోకి వస్తే తప్ప..ప్రజలపై ఆంక్షలు తొలగిపోవు. లాక్ డౌన్ కు సంబంధించి ఆశలు చిగురిస్తున్న అంశం ఏమిటంటే భారతీయ రైల్వేలతో దేశీయ ఎయిర్ లైన్స్ కూడా బుకింగ్స్ ప్రారంభించాయి. దీంతో ఎక్కువ మందిలో లాక్ డౌన్ తొలగిపోతుందనే ధీమాతో ఉన్నారు. అయితే ఈ టెన్షన్ ఏప్రిల్ 14 వరకూ కొనసాగటంగా ఖాయంగా కన్పిస్తోంది.

ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రం ఏప్రిల్ 30 వరకూ దేశీయ, అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ ఓపెన్ చేయటంలేదని స్పష్టం చేసింది. అయితే దేశంలోని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ అన్నీ దేశీయ రూట్లలో టికెట్ బుకింగ్స్ ఇఫ్పటికే ప్రారంభించాయి. అయితే కొత్తగా డీజీసీఏ ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే వాటిని పాటించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. అదే సమయంలో స్పైస్ జెట్, గోఎయిర్ లు మాత్రం మే 1 నుంచి అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it