Telugu Gateway
Latest News

ఎంపీల జీతాల్లో కోత..మోడీ సర్కారు కీలక నిర్ణయం

ఎంపీల జీతాల్లో కోత..మోడీ సర్కారు కీలక నిర్ణయం
X

దేశంలో కరోనా కల్లోలం రేపుతుండటంతో కేంద్రంలోని మోడీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో తొలి అడుగుగా ఎంపీ వేతనాల్లో 30 శాతం మేర కోత విధించింది. ఎంపీలతో పాటు మాజీ ఎంపీలకు ఇఛ్చే పెన్షన్లలోనూ కోత అమలు కానుంది. ఈ మేరకు తెచ్చిన ఆర్డినెన్స్ కు సోమవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అయితే ఈ కోత ఏడాది పాటు అమల్లో ఉండనుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. వేతనాల్లో కోత ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు కూడా వర్తించనుందని ఆయన తెలిపారు.

దీంతోపాటు రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధుల కూడా మంజూరు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రాల గవర్నర్‌లు కూడా 30శాతం తక్కువ జీతం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ నిధులన్నీ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వెళ్తాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ మీడియాకు తెలిపారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లేనన్నారు.

Next Story
Share it