Telugu Gateway
Latest News

పధ్నాలుగు రోజులు..1600 కిలోమీటర్లు నడిచాడు

పధ్నాలుగు రోజులు..1600 కిలోమీటర్లు నడిచాడు
X

కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో మంది వందలు..వేల కిలోమీటర్ల కొద్ది నడిచే తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇందులో కార్మికులే ఎక్కువ. ఉన్న చోట పనిలేదు..తిండి దొరకదు..అందుకే చాలా మంది మొండిగా అయినా సరే నడిచి మరీ సొంత ఊళ్లకు వెళుతున్నారు. అలాంటిదే ఈ యువకుడి కధ కూడా.ఆ యువకుడు ముంబయ్ లో ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ దెబ్బకు అన్నీ మూతపడ్డాయి. అందుకే ఎలాగోలా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో రోడ్డెక్కాడు.

ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 1600 కిలోమీటర్లు నడిచాడు. ఇందుకు 14 రోజులు పట్టింది. ముంబయ్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చేరుకున్నాడు. అతడికి ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. ఆ ఫరీక్షల్లో ఈ సుదీర్ఘ బాటసారికి కరోనా వైరస్ లక్షణాలు కన్పించాయని వైద్యులు తేల్చారు. వెళ్లటానికి బస్సులు, రైళ్ళు లేక చాలా మంది కార్మికులు ఇలా రోడ్డు మార్గాన నడక మార్గాన్ని ఎంచుకున్నారు.

Next Story
Share it