Telugu Gateway
Latest News

మలేషియన్ల కోసం ప్రత్యేక ఫ్లైట్..బ్రేక్ వేసిన ఢిల్లీ విమానాశ్రయ సిబ్బంది

మలేషియన్ల కోసం ప్రత్యేక ఫ్లైట్..బ్రేక్ వేసిన ఢిల్లీ విమానాశ్రయ సిబ్బంది
X

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగటానికి ప్రధాన కారణాల్లో ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం కూడా కారణంగా నిలిచింది. అక్కడకు వచ్చిన మలేషియన్ల ద్వారానే ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ సెంటర్ లో జరిగిన సదస్సుకు హాజరైన ఎనిమిది మంది మలేషియన్లు ప్రత్యేక విమానంలో తమ దేశానికి వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ వారిని ఆదివారం నాడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఆపేశారు. దేశం నుంచి ప్రస్తుతం అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసినా కొన్ని దేశాలు కరోనా కారణంగా చిక్కుకుపోయిన వారి దేశస్తులను తరలించేందుకు ప్రత్యేక విమానాలు నిర్వహిస్తున్నాయి.

గత నెలలో జరిగిన మత సమావేశానికి హాజరైన ఎనిమిది మంది మలేషియన్లు ఢిల్లీలోని వివిధ ప్రదేశాల్లో ఉండి మలిండో ఎయిర్ రిలీఫ్ విమానం ద్వారా ఉడాయించాలని చూసినట్లు ‘ఎన్డీటీవీ’ తెలిపింది. వీరిని విమానాశ్రయంలో నిలిపివేసిన ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తదుపరి విచారణ కోసం ఢిల్లీ పోలీసులకు అప్పగించింది. వ్యవహారం ఢిల్లీ పోలీసులకు చేరటంతో వీళ్ళ కాల్ డేటాను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. చాలా మంది టూరిస్ట్ వీసాల ద్వారా వచ్చి ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొని నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇప్పటికే గుర్తించారు.

Next Story
Share it