Telugu Gateway
Latest News

కోవిడ్ 19 డెత్ క్లైయిమ్స్ ప్రాసెస్ కు భరోసా

కోవిడ్ 19 డెత్ క్లైయిమ్స్ ప్రాసెస్ కు భరోసా
X

జీవితభీమా కంపెనీలు అన్నీ కోవిడ్-19 డెత్ క్లెయిమ్స్‌ ను ప్రాసెస్ చేస్తాయని భరోసా లైఫ్ఇన్సూరెన్స్ కౌన్సిల్ భరోసా ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని సంస్థలు అన్నీ కోవిడ్-19 కారణంగా ఎదురయ్యే డెత్ క్లెయిమ్స్ అన్నింటినీ వీతైనంత త్వరగా ప్రాసెస్ చేస్తాయని వెల్లడించింది. కోవిడ్-19 డెత్ క్లెయిమ్స్‌ లో 'ఫోర్స్ మేజూర్' అనే నిబంధన వర్తించదని కౌన్సిల్ ధృవీకరించింది. తమ కాంట్రాక్ట్‌ లో ఈ నిబంధనపై స్పష్టత కోరుతూ వ్యక్తిగత జీవిత భీమా కంపెనీలకు చేరిన వినియోగదారులకు భరోసా ఇవ్వడానికి, దీనికి భిన్నంగా జరుగుతున్న వదంతులకు అడ్డుకట్టవేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ అంశమై అన్ని జీవిత భీమా సంస్థలూ ఇప్పటికే తమ వినియోగదారులకు సమాచారం అందించడం జరిగింది.

లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్, మాట్లాడుతూ " అంతర్జాతీయంగా మాత్రమే గాక స్థానికంగా కూడా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తీరు కారణంగా ప్రతి ఇంటికీ జీవిత భీమా ప్రాధమిక అవసరంగా మారింది. లాక్‌డౌన్ వేళ పాలసీ హోల్డర్లపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు జీవిత భీమా పరిశ్రమ తగు చర్యలను తీసుకుంది. కోవిడ్-19 సంబంధిత మరణాలను క్లెయిమ్ చేయడం లేదా వారి పాలసీ సేవల పరంగా అయినా సరే ఎలాంటి క్లిష్టత లేకుండా డిజిటల్‌గా వారికి మద్దతునందిస్తున్నాం. ఈ కష్టకాలంలో తమ వినియోగదారులకు అన్ని జీవిత భీమా కంపెనీలూ మద్దతునందిస్తాయని పునరుద్ఘాటించడమే కాదు తప్పుడు సమాచారాన్ని విశ్వసించవద్దని కోరుతున్నాం'' అని అన్నారు.

Next Story
Share it