మే 4 నుంచి ఇండిగో సర్వీసులు
BY Telugu Gateway14 April 2020 4:00 PM GMT

X
Telugu Gateway14 April 2020 4:00 PM GMT
దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఇండిగో’ మే 4నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభిస్తామని ఇండిగో సీఈవో రానో జోయ్ దత్త ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనాపై ప్రభుత్వం పోరాటాన్ని ఆయన ప్రశంసించారు. వచ్చే రోజుల్లో తమ నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచుకుంటామని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా దేశీయ విమాన సర్వీసులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
Next Story