Telugu Gateway
Latest News

లాక్ డౌన్ ను లెక్కచేయని కరోనా

లాక్ డౌన్ ను లెక్కచేయని కరోనా
X

లాక్ డౌన్ ను లెక్క చేయకుండా దేశంలో కరోనా వైరస్ రెచ్చిపోతుంది. తొలి రోజుల్లో పరిమిత సంఖ్యలో ఉన్న కేసులు గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో పెరుగుతూ పోతున్నాయి. లాక్ డౌన్ అమల్లోకి వచ్చి 21 రోజులు అవుతున్నా పాజిటివ్‌ల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10వేలు దాటింది.

గడిచిన 24 గంటల్లో 1211 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్యాయి. దీంతోపాటు 31 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 10,363కు చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో 339 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా 1035 కరోనా బాధితులు కొలుకున్నారని అధికార గణాంకాలు వెల్లడించాయి.

Next Story
Share it