Telugu Gateway
Latest News

దుబాయ్ విమానాశ్రయం..పది నిమిషాల్లో కరోనా టెస్ట్

దుబాయ్ విమానాశ్రయం..పది నిమిషాల్లో కరోనా టెస్ట్
X

ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ సంస్థ దుబాయ్ విమానాశ్రయంలో కరోనా టెస్ట్ లకు శ్రీకారం చుట్టింది. రక్తపరీక్షల ద్వారా ఫలితాన్ని తేల్చనున్నారు. అది కూడా పది నిమిషాల్లో. రాపిడ్ కిట్ల సాయంతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయాల్లో ఇలా రాపిడ్ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహించటం ఇదే మొదటిసారి అని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. దుబాయ్ లో చిక్కుకుపోయిన విదేశీయులను తరలించేందుకు ఇప్పుడు కొత్తగా సర్వీసులు ప్రారంభించారు. అందులో భాగంగా తొలి విడత టునీషియా వెళ్లిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రయాణానికి ముందే పరీక్షలు నిర్వహించి వారిని విమానాల్లోకి అనుమతిస్తున్నారు.

రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించినా ఇదే తరహా పద్దతిని పాటించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత ప్రపంచంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో కేవలం స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే నిర్వహించారు. ఇఫ్పుడు గతానికి భిన్నంగా ఏకంగా కరోనా టెస్ట్ లు ప్రారంభించారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఏ దేశం కూడా ఇఫ్పుడు రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేదు. దీంతో ఎవరికి వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నారు దుబాయ్ విమానాశ్రయంలో.

Next Story
Share it