అమెరికాలో కరోనా మృతులు 14768
BY Telugu Gateway9 April 2020 12:15 PM IST

X
Telugu Gateway9 April 2020 12:15 PM IST
అమెరికాలో కరోనా కలకలం ఆగటం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4,31,838 కేసులు నమోదు కాగా, 14,768 మంది చనిపోయారు. ఒక్క న్యూయార్క్ లోనే 1,51,069 కేసులు నమోదు అయ్యాయి. న్యూయార్క్ నగరం ఒక్క చోటే మృతుల సంఖ్య 6268గా ఉంది. న్యూయార్క్ లో ఉన్నంత దారుణంగా పరిస్థితి మరెక్కడా లేదనే చెప్పాలి. అమెరికాలో దేశమంతా కలిపి ఒక్క బుధవారం నాడే 1939 మంది మరణించారు.
తాజాగా అమెరికాలో పదకొండు మంది భారతీయులు మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మరో 16 మంది భారతీయులు కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్నారు. వైరస్ బారిన పడిన భారతీయుల్లో ఎక్కువ మంది న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో నివసించే వారు ఉన్నారు.
Next Story



