Telugu Gateway
Latest News

అమెరికా.. ఎక్కడ ఎన్ని కరోనా కేసులో తెలుసా?

అమెరికా.. ఎక్కడ  ఎన్ని కరోనా కేసులో తెలుసా?
X

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. ఏప్రిల్ 2 రాత్రి సయటానికి అమెరికాలో మొత్తం 2,16,458 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటికే 5119 మరణాలు నమోదు అయ్యాయి. మరణాల విషయంలో కరోనా వైరస్ పుట్టిన చైనాకు చెందిన అధికారిక లెక్కలను అమెరికా ఇప్పటికే దాటేసింది. అయితే అమెరికాలో ఈ కేసుల సంఖ్య గంటకూ మారుతోంది. అమెరికా అంతటా చూస్తే న్యూయార్క్ లోనే అత్యధిక కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క న్యూయార్క్ లోనే 84,025 కరోనా కేసులు నమోదు అయ్యాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అమెరికాలోని ఏ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు లేవు. న్యూయార్క్ తర్వాత అత్యధిక కేసులు ఉన్న మరో ప్రాంతం న్యూజెర్సీ. న్యూజెర్సీలో ఇఫ్పటి వరకూ 22,255 కేసులు, క్యాలిఫోర్నియాలో 9,870 కేసులు, మిచిగాన్ లో 9315 కేసులు, ఫ్లోరిడాలో 7773 కేసులు, మసాచుసెట్స్ లో 7738 కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో అతి తక్కువ కేసులు ఉన్న ప్రాంతం మాత్రం కొలరాడో. ఇక్కడ 3342 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కనెక్ట్ కట్ లో 3557 కేసులు, టెక్సాస్ లో 4607, జార్జియాలో 4748 కేసులు, వాషింగ్జన్ లో 5923 కేసులు, పెన్సిల్వినియాలో 6063, ఇల్లినాయిస్ లో 6980 కేసులు ఉన్నాయి.

అమెరికాలో కేసులు ఈ సంఖ్యలో పెరగటానికి అధ్యక్షుడు ట్రంపే కారణం అని విమర్శలు పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. ట్రంప్ సైతం రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చాలా దేశాలు ముందే మేల్కొని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటే ట్రంప్ మాత్రం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నానా కష్టాలు పడుతున్నారు. అయితే మెజారిటీ తెలుగు రాష్ట్రాల వారు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్ళలోనే ఉంటూ వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అమెరికాలో ఒక్క బుధవారం రోజే 884 మంది మృతిచెందడం అగ్రరాజ్యంలో ఆందోళన కలిగిస్తోంది.

Next Story
Share it